Diwali : దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం రిక్వెస్ట్

by Ramesh N |
Diwali : దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఆయన తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించే ప్రతి కుటుంబం మట్టితో తయారు చేసిన దీపాలనే వాడాలని సూచించారు. మట్టి దీపాలతో పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేకూర్చడమే కాకుండా కుల వృత్తులను కాపాడినట్లు ఉంటుందని పిలుపు నిచ్చారు.

మట్టితో తయారు చేసిన వస్తువులను వాడటం వల్ల పర్యావరణం రక్షించడం, గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన వారిమి అవుతామని అన్నారు. మట్టితో తయారు చేయబడిన జగ్గులు, చాయ్ కప్పులు, వాటర్ బాటిల్, దివ్వెలు లాంటి వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వీటి వల్ల ప్రకృతి, పర్యావరణం కాపాడుతూ కుల వృత్తుల వారికి ఉపాధి కల్పించిన వారిమి అవుతామని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story