Biswa Sarma: జార్ఖండ్‌లో ముస్లిం జనాభా పెరుగుతోంది.. అసోం సీఎం బిస్వశర్మ

by vinod kumar |
Biswa Sarma: జార్ఖండ్‌లో ముస్లిం జనాభా పెరుగుతోంది.. అసోం సీఎం బిస్వశర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రంలో ముస్లిం జనాభా రోజు రోజుకూ పెరుగుతోందని అసోం సీఎం, బీజేపీ ఎన్నికల కో ఇన్ చార్జ్ హిమంత బిస్వశర్మ(Himanth biswa sharma) ఆరోపించారు. ముస్లిం(Muslim population) పాపులేషన్ అధికమవ్వడానికి చొరబాట్లే కారణమని తెలిపారు. సోమవారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. చొరబాట్లను నియంత్రించి జార్ఖండ్‌ను బంగారు భూమిగా మార్చాలన్నారు. ‘ప్రతీ ముస్లిం చొరబాటుదారుడు కాదు. కానీ ప్రతి ఐదేళ్లకు ముస్లింల జనాభా ఎలా పెరుగుతోంది? ఒక కుటుంబం10 నుంచి12 మంది పిల్లలకు జన్మనిస్తోందా? చాలా మంది పిల్లలకు జన్మనివ్వకపోతే, ఖచ్చితంగా బయటి నుంచి ప్రజలు వచ్చినట్టే. సంతాల్ పరగణా జిల్లా (santhal paragana distric) నుంచి చొరబాటుదారులను తరిమి కొట్టి, మహిళలకు న్యాయం చేయడం ముఖ్యమైన పని’ అని వ్యాఖ్యానించారు. చొరబాటుదారులకు మదర్సాలలో శిక్షణ ఇస్తున్నారని, అంతేగాక ఆధార్ కార్డులు కూడా తయారు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని, తమ ప్రభుత్వం ఏర్పడగానే ఎన్నార్సీ అమలు చేస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed