రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన భారతీ ఎయిర్‌టెల్‌.. లాభం రూ. 3,593 కోట్లు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-28 15:47:48.0  )
రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన భారతీ ఎయిర్‌టెల్‌.. లాభం రూ. 3,593 కోట్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని ప్రముఖ సంస్థలు గత కొన్ని రోజులుగా జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే . తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ(Telecom Company) భారతీ ఎయిర్‌టెల్‌(Bharti Airtel) త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) సెప్టెంబర్ తో ముగిసిన రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ రూ. 3,593 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు తెలిపింది. కాగా గతేడాది ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం రూ.1341 కోట్లుగా ఉందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది.

ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం 12 శాతం పెరిగి రూ.37,044 కోట్ల నుంచి రూ.41,473 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం రూ. 254 కోట్లు వచ్చినట్లు తెలిపింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ. 203 నుంచి రూ. 233కి పెరిగిందని వెల్లడించింది. అలాగే ఎయిర్‌టెల్‌ కస్టమర్లు సగటున నెలకు 23.9 జీబీ డేటాను యూజ్ చేస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కాగా త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ధర 0.057 శాతం మేర తగ్గి రూ.1665.05 వద్ద ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed

    null