- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగర సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం.. నిధులు మంజూరు చేసిన సర్కార్
దిశ, సిటీబ్యూరో : నగర సుందరీకరణలో భాగంగా జంక్షన్లు, ఫ్లైఓవర్లు, పార్కుల సుందరీకరణ పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన పచ్చదనంలో అంతర్జాతీయ గ్రీన్ సిటీగా అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. నగరంలో కాలుష్యరహిత వాతావరణం అందించేందుకు నూత్న పద్ధతిలో పచ్చదనం పెంపొందించడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఫారెస్ట్ విస్తీర్ణం పెరిగినట్లుగా జాతీయంగా గుర్తింపు లభించింది.
రూ.149 కోట్లు మంజూరు..
తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సుందరీకరణ నగరంగా గ్రేటర్ హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో 6 జోన్లకు మొత్తం రూ.149 కోట్లను మంజూరు చేయడంలో జీహెచ్ఎంసీ కార్యరూపం దాల్చింది. ఇంతకు ముందు కూడా గ్రేటర్లో పాదాచారులకు ప్రయోజనాలు కల్పించి ప్రమాదరహితంగా జంక్షన్లను అభివృద్ధి చేశారు. ఈ జంక్షన్లలో పాదాచారుల భద్రతతో పాటుగా సుందరీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో కొన్ని సీఎస్ఆర్ పద్ధతిలో చేపట్టేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు రావడం జరిగింది. ఈ జంక్షన్ అభివృద్ధిలో పాదాచారులకు ట్రాఫిక్ ఉన్న సందర్భంలో కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ లేని సమయంలో పాదాచారులు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా రోడ్డు దాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ల వద్ద కళాత్మక చిత్రలేఖనాలు, ముఖ్యంగా భావితరాలను ప్రభావితం చేసే విధంగ తీర్చిదిద్దారు. ఫ్లై ఓవర్ పిల్లర్స్ కొన్ని చోట్ల ఉద్యానవన పెయింట్స్ వెరైటీ థీమ్స్‌తో కళాత్మక చిత్రాలు వేశారు. సెంట్రల్ మీడియం, జంక్షన్లలో శిల్పాలు, ఆకర్షించే ప్రత్యేక థీమ్‌లతో నగరాన్ని సుందరంగా ముస్తాబు చేసేందుకు జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వ్యాప్తంగా సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో ఆరు జోన్ల పరిధిలో రూ.149.84 కోట్ల అంచనా వ్యయంతో 224 సుందరీకరణ పనులు చేపట్టగా అందులో రూ.5.33 కోట్ల విలువ గల 15 పనులు పూర్తి అయ్యాయి. మిగతా 209 పనులు వివిధ దశలలో ఉన్నాయి. చిన్నారులు, యువతకు స్ఫూర్తినిచ్చేలా సుందరీకరణ పనులు చేపట్టినట్లు పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.