TG: వృద్ధులు, మహిళలకు గుడ్ న్యూస్.. పింఛన్ల పెంపుపై సర్కార్ కీలక నిర్ణయం?

by Gantepaka Srikanth |
TG: వృద్ధులు, మహిళలకు గుడ్ న్యూస్.. పింఛన్ల పెంపుపై సర్కార్ కీలక నిర్ణయం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సిక్స్ గ్యారంటీస్‌లో నుంచి రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ రెండు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. లేదంటే క్షేత్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయి ఈ డెసిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే రైతుభరోసా అమలు చేయకపోవడంతో రైతులు, పింఛన్లు పెంచకపోవడంతో మహిళలు అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ పార్టీ వర్గాల్లో ఉన్నది. కులగణన సర్వేలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లను సైతం ప్రజలు రైతు భరోసా ఎప్పుడిస్తారు..? పింఛన్లు ఎప్పుడు పెంచుతారు..? అనే క్వశ్చన్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆ రెంటిండిని అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే మొదటికే మోసం వస్తుందని.. ఎలక్షన్స్‌కు ముందే అమలు చేస్తే రైతులు, మహిళల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని భావిస్తున్నట్లు తెలిసింది.

అసెంబ్లీలో భరోసాపై డిస్కషన్

వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే రైతు భరోసాపై ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలి? అనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా అభిప్రాయాలు సేకరించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి, రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అదే విధంగా అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ద్వారా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రైతుభరోసా విధివిధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఇటు సర్వే సైతం ఈ నెల చివరి వరకు ముగియనుంది. ఆ తర్వాత రాష్ట్రంలో బీసీ జనాభా ఏ మేరకు ఉందనేది క్లారిటీ వస్తుంది. అలాగే లోకల్ బాడీలో రిజర్వేషన్లు సైతం ఫైనల్ కానున్నాయి. సంక్రాంతి తరువాత లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉండడంతో ఈ లోపే రైతుభరోసా ఇచ్చి తీరాలనే టార్గెట్‌లో ప్రభుత్వం ఉన్నట్టు ఓ మంత్రి అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story