- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Pahalgam attack: బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలి- ఉగ్రదాడిపై అమెరికా కామెంట్స్

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రక్తతలు తీవ్రతరమయ్యాయి. కాగా.. ఈ ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు (India-Pakistan) ‘బాధ్యతాయుతమైన పరిష్కారం’ తీసుకురావాలని అగ్రరాజ్యం సూచించింది.‘‘ఇది సంక్లిష్ట పరిస్థితి. భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం. పరిస్థితిని సరిదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని మేం ప్రోత్సహిస్తున్నాం’’ అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అన్నారు. అయితే, ఉగ్రదాడి (Pahalgam Terror Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయంలో భారత్‌కు వాషింగ్టన్ అండగా ఉంటుందని మరోసారి చెప్పుకొచ్చింది.
పహెల్గాం ఉగ్రదాడి
అంతకుముందు, ఉగ్రదాడిపై ట్రంప్ కూడా స్పందించారు. పహెల్గాం దాడి చెత్త పని అని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యను భారత్-పాక్‌లు పరిష్కరించుకుంటాయని తెలిపారు. ఇదిలాఉండగా.. పహెల్గాం ఉగ్రదాడితో తమకు ఏ సంబంధం లేదంటూ పాక్ బుకాయిస్తోంది. దీనిపై అంతర్జాతీయ దర్యాప్తు కోరింది. కానీ, పాకిస్థాన్ మంత్రులు మాత్రం భారత్ కు వార్నింగ్ ఇస్తూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఏప్రిల్ 22న పహెల్గాంలో పర్యాటకులపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.