Megastar Chiranjeevi: ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-28 15:48:29.0  )
Megastar Chiranjeevi: ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) అందజేశారు. అవార్డు అందజేత అనంతరం చిరంజీవి(Megastar Chiranjeevi) మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెబుతారు. నేను నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం సినీ వజ్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రధానంతో ధన్యుడిగా భావిస్తున్నాను. నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడం కొందరికి నచ్చలేదు.


అందుకే అవార్డు తీసుకోవడం సముచితం కాదనిపించింది. అందుకే ఆరోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్స్ బాక్సులో వేశాను. పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులు వచ్చినా అసంతృప్తి మిగిలే ఉంది’ అని చిరంజీవి ఎమోషన్ కామెంట్స్ చేశారు. కాగా, ఈ వేడుకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున కుటుంబ సభ్యులతోపాటు పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు సహా పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.


Read More...

ANR National Award : చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానం


Advertisement

Next Story

Most Viewed