KTR: వాళ్ల మీదే నాకు అనుమానం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
KTR: వాళ్ల మీదే నాకు అనుమానం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయేలా కాంగ్రెస్ నేతలు ఏదైనా చేశారేమో అనే అనుమానం కలుగుతోందని కీలక ఆరోపణలు చేశారు. మూడు పిల్లర్లు కుంగటం అంటే అనుమానం వస్తోందని అన్నారు. నిర్మాణంలో లోపం కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం ప్రాజెక్ట్‌కు జరగాలి కదా అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి ఏం జరిగినా మరమత్తులు చేయొద్దని ఫిక్స్ అయినట్లున్నారని ఎద్దేవా చేశారు.

కేవలం అహం అడ్డొచ్చే మరమత్తులు చేయడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ పని అయిపోయిందన్నారని, కాళేశ్వరం పనికి రాదన్నారని గుర్తుచేశారు. కానీ పంపులు పని చేస్తున్నాయని తెలిపారు. కన్నెపల్లి నుంచి రోజు 3 టీఎంసీలు పంప్ చేయవచ్చని చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక పేరు చెబుతూ పంప్ చేయబోమని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. కన్నెపల్లి నుంచి నీటిని పంప్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 10 లక్షల క్యూసెక్కుల తాకిడిని తట్టుకొని మేడిగడ్డ నిలబడలేదా? అని ప్రశ్నించారు. 28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుందని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవని, ఇంకా తమను టార్గెట్ చేస్తే కాంగ్రెస్‌కు ఏమి లాభమని, రైతుల కోసం ఆలోచించి నీరు విడుదల చేయాలని హితవు పలికారు.

Advertisement

Next Story