Rahul Gandhi అబద్దాలతో మోసం చేస్తున్నారు: కేటీఆర్

by karthikeya |
Rahul Gandhi అబద్దాలతో మోసం చేస్తున్నారు: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: మహరాష్ట్రలో రాహుల్ గాంధీ అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఆరోపించారు. మహరాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ సొమ్ములు తరలిపోతున్నాయని, ఇక్కడి ప్రజల సొమ్మును దోచుకుని అక్కడ ఎన్నికల్లో వరదల్లా పారిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల నుంచి రూ.300 కోట్ల సొమ్ముని దోచుకుని మహారాష్ట్రలో అబద్ధాల ప్రచారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుతోందని ఆరోపించిన ఆయన.. తెలంగాణలో ఇచ్చిన హమీలు అమలు చేయకుండా, అమలుకు నిధులు లేవంటూనే.. అన్నీ అమలు చేసేశామంటూ మహారాష్ట్రలో అబద్ధాలను ప్రచారం చేయడమే కాకుండా దాని ప్రచారం కోసం అడ్డగోలుగా వందల కోట్ల ప్రజా ధనాన్ని వాడుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఈ అబద్ధాలను మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘రూ.2500 రూపాయలు మహిళలకు ఇచ్చినట్లు అబద్దాలను రాహుల్ గాంధీ మహరాష్ర్టం చెప్తున్నారు. రాష్ట్రంలో ఒక్క మహిళతో అయినా ఆ డబ్బులు అందాయని చెప్పించండి. తెలంగాణలో ఇచ్చిన ఏ హమీని కాంగ్రెస్ నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ కూడా పూర్తిగా జరలేదు. కానీ పూర్తి అయినట్టు రాహుల్ అసత్యాలు చెప్తున్నారు. తెలంగాణలో హమీలు అమలు అయ్యాయో లేదో ఇక్కడి ప్రజలను అడిగి మహరాష్ర్ట ప్రజలు అడిగి తెలుసుకోవాలి. స్వయంగా ముఖ్యమంత్రి గ్రామంలో కూడా అడిగినా ప్రజలు హమీల అమలులో ప్రభుత్వం ఎంతలా విఫలమైందో చెప్తారు.’’ అని నిప్పులు చెరిగారు.

అంతేకాకుండా మహరాష్ర్ట ప్రజలు ప్రాంతీయ పార్టీలకే ఓటు వేయాలని, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఒటు వేయవద్దని కోరారు. ఉత్తర ప్రదేశ్, బెంగాల్ వంటి రాష్ర్టాల్లో బీజేపీని అడ్డుకున్నది ప్రాంతీయ పార్టీలేనని, బీజేపీని అపే శక్తి కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులను ఎలక్షన్ కమిషన్ స్వయంగా నిర్వహించాలని, అప్పుడే తెలంగాణ డబ్బులు మహరాష్ట్రకి వెళ్లకుండా అడ్డుకోగలుగుతామని కోరారు.

Advertisement

Next Story