- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇచ్చిన హామీ నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదే : చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడురు శ్రీనివాస్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా ప్రభుత్వంలో పది నెలలు తిరగకముందే చేనేతలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం సీఎం రేవంత్‌రెడ్డి అని ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడురు శ్రీనివాస్ కొనియాడారు. వేములవాడలో నూలు డిపో ఏర్పాటుకు రూ.50 కోట్లు విడుదల చేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం చేనేత విభాగం ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గూడురు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని పక్కకు పడేసిందన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన పాదయాత్రలో చేనేత కార్మికుల సమస్యలను స్పష్టంగా తెలుసుకున్నారని, అందుకే ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో సులువుగా పరిష్కరిస్తున్నారని అన్నారు. చేనేత కార్మికుల అప్పులు తీర్చిన మహనుభావుడు రేవంత్‌రెడ్డి అని కొనియాడారు. సిరిసిల్ల నేత కార్మికులకు గత ప్రభుత్వం పెట్టిన రూ.300 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఏర్పడగానే క్లియర్ చేశారని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చేనేత కార్మికుల సమస్యలను ఒక్కొక్కటికీ పరిష్కరిస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆకలి చావులు నుంచి బయట పడుతున్నామని వివరించారు. వేములవాడలో ఏర్పాటు కాబోయే నూలు డిపో వలన కార్మికులు, వ్యాపారులు బొంబాయి, సూరత్‌లకు వెళ్లే బాధ తప్పిందని అన్నారు.