రాష్ట్రంలో విష జర్వాల నివారణ కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి: KTR

by Anjali |
రాష్ట్రంలో విష జర్వాల నివారణ కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి: KTR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని డెంగ్యూ జ్వరాలపై బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విషజ్వరాలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 6,000 డెంగీ కేసులు నమాదయ్యాయని తెలిపారు. ప్రభుత్వం మాత్రం లెక్కలను దాచే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ కాంగ్రెస్ పాలనను విమర్శించారు. గత 5 రోజుల్లోనే 800 కొత్త డెంగీ కేసులు నమాదైనట్లు ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ డైరెక్టరే నిర్ధారించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. డెంగీ మహమ్మరి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. విష జర్వాల వ్యాప్తిని నివారించే చర్యలు చేపట్టాల్సిన అన్నారు. డెంగీ మరణాల లెక్కలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తుండటం దురదృష్టకరమని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారదర్శకంగా విష జర్వాల నివారణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed