- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KTR ఇదేనా నీ నీతి..? T-కాంగ్రెస్ సంచలన ట్వీట్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డబ్బు, మద్యం అంశంలో హైవోల్టేజ్ రాజకీయం నడుస్తోంది. డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామని సీఎం ప్రమాణం చేసేందుకు అమరవీరుల స్థూపం వద్దకు రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో నిన్న మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభకు ప్రజలను తరలించేందుకు బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచిపెట్టడం హాట్ టాపిక్ అయింది.
సీఎం సభకు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సభ ముగిసిన తర్వాత టోకెట్లు చూపిన వారికి డబ్బులు పంచిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా టీ కాంగ్రెస్ నేతలు ఈ వీడియోలపై సెటైర్లు వేస్తున్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 'ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంచిపెట్టే చిల్లర రాజకీయం తాను చేయను' అంటూ నీతులు వల్లించారని మరి బీఆర్ఎస్ కౌన్సిలర్లే సిరిసిల్లలో టోకెన్లు ఇచ్చి మరీ డబ్బులు, మద్యం పోయిస్తున్నారని దీన్నేమంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డబ్బులు, మద్యాన్నే నమ్ముకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల డబ్బుల పంపకాలు వ్యవహారం దుమారంగా మారింది.