- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: మళ్లీ ఢిల్లీకి కేటీఆర్.. హాట్ టాపిక్‌గా మారిన సడన్ టూర్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న బాధిదులు, రైతులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్(SC and ST Commission)లో ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే రైతులు, ఫార్మా కంపెనీ బాధితులు ఢిల్లీ చేరుకున్నారు. రేపు సాయంత్రం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి.. రైతులతో కలిసి స్వయంగా కమిషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్‌పై, అధికారులపైన దాడికి పాల్పడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్‌లో ఈ ఘటన జరుగడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే దాడికి కారణమైన పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు.. జాతీయ మానవహక్కుల కమిషన్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన, పొలీస్‌లపైన ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.