మెగా టెక్స్ టైల్ పార్క్ సాధించిన ఘనత కేటీఆర్‌దే: L. రమణ

by Satheesh |
మెగా టెక్స్ టైల్ పార్క్ సాధించిన ఘనత కేటీఆర్‌దే: L. రమణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న చేనేత క్లస్టర్‌లను మంజూరు చేసి చేనేత కళాకారుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంజూరు చేయాలని కోరారు. రద్దు చేసిన హ్యాండ్లూమ్ బోర్డ్2ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ బుంకర్ యోజన పథకంను పున:ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు కేంద్రం నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేసి, చేనేత మరనేత వృత్తిలో ఉన్న వారికి అనేక ప్రోత్సాహకాలు అందించారన్నారు. తెలంగాణ టెక్స్టైల్ అప్పారల్ (టీ-టాఫ్) పాలసీని తీసుకువచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్నారు. కిటెక్స్ సంస్థ కాకతీయ టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టడం సంతోషమకరన్నారు. నూతన పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి వీలుగా రాష్ట్రంలో అనేక చోట్ల మినీ టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తూ వలస కార్మికులను రప్పిస్తూ నేత వృత్తి ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మంత్రి కేటీఆర్ కృషి అభినందనీయమన్నారు.

Advertisement

Next Story

Most Viewed