- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ రాజకీయ ప్రస్థానం ముగిసేది బీజేపీలోనే.. కేటీఆర్ హాట్ కామెంట్స్
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో కలిసి చేరడం ఖాయమని అన్నారు. ‘నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు’ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఇది వాస్తవమా? కాదా? రేవంత్ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని అన్నారు.
Advertisement
Next Story