- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'డిగ్రీ కళాశాల ఏర్పాటు మరిచిన కేటీఆర్'
దిశ,ముస్తాబాద్: మంత్రి కేటీఆర్ మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తా అని హామీ ఇచ్చి మరిచారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. సోమవారం ముస్తాబాద్‌లో విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు యేళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మాట తప్పిన మంత్రి కేటీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. 6 నెలల క్రితమే సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. వాడేవడో, వీడేవడో మాట్లాడితే కాదు. ముస్తాబాద్ తమ్ముళ్ల కోసం కళాశాలని మంజూరు చేస్తున్నా అని చెప్పిన మాటలను గుర్తు చేశారు. వెంటనే కేటీఆర్ మాట నిలబెట్టుకుని మండల విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాలని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోజుకో విధంగా నిరసనలు చేపట్టి రానున్న రోజుల్లో కళాశాల మంజూరు సాధనకై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై ధర్నా చేపట్టడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని విరమింపజేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓరగంటి తిరుపతి, పెద్దిగారి శ్రీనివాస్, దీటి నర్సింహులు, బాల్‌రెడ్డి, రాజేశం, గుండెల్లి శ్రీనివాస్, అరుట్ల మహేష్, మధు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.