గల్ఫ్ కార్మికుల వలసలపై KTR భావోద్వేగ వ్యాఖ్యలు

by Rajesh |
గల్ఫ్ కార్మికుల వలసలపై KTR భావోద్వేగ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ దేశాల్లో వలసలపై కేటీఆర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఓ పుస్తకావిష్కరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. గల్ఫ్‌లో బాధలు, వెతలు తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. స్వయంగా తాను గల్ఫ్ కార్మికుల లేబర్ క్యాంపు‌నకు వెళ్లి పరిశీలించినప్పుడు మొత్తం ఓ డార్మిటరీ మాదిరిగా ఒక్కో రూములో పది మందిని ఇరికిస్తారన్నారు. దుబాయ్ అంటే బుర్జ్ ఖలీఫా, అందమైన భవనాలు మాత్రమే కాదని.. వాటి పక్కనే డేరా లాంటి ప్రదేశాల్లో లేబర్ క్యాంపుల్లో అత్యంత అమానవీయమైన పరిస్థితులు ఉంటాయన్నారు.

లక్ష కోట్లు ఏడాదికి ఎన్ఆర్ఐలు ఇండియాకు పంపుతున్నారని.. అందులో మూడో వంతు గల్ఫ్ దేశాలను నుంచే భారతదేశానికి వస్తున్నాయని పత్రికలు రాశాయని గుర్తు చేశారు. అయితే లేబర్‌లను కలిసి తాను ఎంత జీతం సంపాదిస్తున్నారని అడిగి షాక్ అయ్యాను అన్నారు. హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో కూడా అంత డబ్బు సంపాదించొచ్చు అన్నారు. అయినా ఇమిగ్రెంట్‌గా మారిన తర్వాత మనలో కష్టపడేతత్వం మరింత పెరుగుతుందన్నారు. అది అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ అయినా సేమ్ మన వాళ్లు అలానే ఆలోచిస్తారన్నారు.

Advertisement

Next Story

Most Viewed