లక్షలాది పాడి రైతుల జీవితాలతో ముడిపడున్న విజయ డైరీ సంస్థను నిర్లక్ష్యం చేయొద్దు: KTR

by Anjali |   ( Updated:2024-09-02 02:40:18.0  )
లక్షలాది పాడి రైతుల జీవితాలతో ముడిపడున్న విజయ డైరీ సంస్థను నిర్లక్ష్యం చేయొద్దు: KTR
X

దిశ, వెబ్‌‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పాలనపై ఆరోపణలు చేస్తున్నారు. విద్యాసంస్థలపై, నిరుద్యోగుల తరపున, రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. తరచూ సోషల్ మీడియాలో ప్రజలు సమస్యలు ఇవంటూ లేవనెత్తుతున్నారు. వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్నటివరకు గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ తాజాగా విజయ డైరీ సంస్థపై స్పందించారు. నిరుటి దాకా లాభాల్లో ఉన్న విజయ డైరీ, వరుసగా ఐదేళ్లు ప్రభుత్వానికి లాభాల్లో వాటాలు (డివిడెండ్లు) ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు సంస్థ ఒక్కసారిగా నష్టాల బాటలో ఎలా వెళ్తోందని ప్రశ్నించారు. సంస్థ వెనకబడటానికి కారణమేంటో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని అడిగారు. లక్షలాది పాడి రైతుల జీవితాలతో ముడి పడి ఉన్న సంస్థ విజయ డైరీ అని అన్నారు. అలాంటి ముఖ్యమైన సంస్థ నిర్వహణలో నిర్లక్ష్యం చేయడం సరైందని కాదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి విజయ డైరీ సంస్థను కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed