- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్ ప్రసంగం టైమ్‌లో మొబైల్ ఫోన్‌తో కేటీఆర్ బిజీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో చాలా మంది ఆసక్తిగా ఆ స్పీచ్ కాపీని అధ్యయనం చేయడంలో మునిగిపోయారు. ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసంగాన్ని వినడంలో మునిగిపోయారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం దాదాపు గంటంపావు సమయంలో గంటసేపు మొబైల్‌ను ఆపరేట్ చేయడంలో నిమగ్నమయ్యారు. బడ్జెట్ పుస్తకాలను కొద్దిసేపు తిరగేసి ఆ తర్వాత మొబైల్‌మీద దృష్టి పెట్టారు. అసెంబ్లీ హాల్ లోపల సిగ్నల్స్ రావుగదా.. ఏం చేస్తున్నారనే సందేహాలు గ్యాలరీలో కూర్చున్న సందర్శకుల్లో, పాత్రికేయుల్లో చర్చలుగా మారాయి. కొద్దిసేపు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో ముచ్చటించడం మినహా ఎక్కువసేపు మొబైల్ ఆపరేషన్‌లో మునిగిపోవడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను 420 హామీలు అంటూ ఇంతకాలం విమర్శలు చేసిన కేటీఆర్.. బడ్జెట్‌ల వాటి కేటాయింపులపై ఆసక్తిగా అధ్యయనం చేస్తారని చాలా మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు భావించారు. కానీ సీటులో ఒక్కరే కూర్చుని మొబైల్‌తో బిజీ అయిపోవడం గమనార్హం.