తొలిసారి ప్రతిపక్షంలో బీఆర్ఎస్.. ఎల్పీ లీడర్‌గా కేటీఆర్!

by GSrikanth |
తొలిసారి ప్రతిపక్షంలో బీఆర్ఎస్.. ఎల్పీ లీడర్‌గా కేటీఆర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం కొల్పోయిన బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణపై దృష్టి సారించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ నేత ఎవరు అనేది ఆసక్తిగా మారింది. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకోవాల్సిన పరిస్థితి చందంగా రెండు దఫాలుగా ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వాన్ని నడిపించిన గులాబీ బాస్ కేసీఆర్ రాబోయే రోజుల్లో సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారా? లేక ఆ బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావు ఎవరికో ఒకరికి అప్పగిస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాం అవుతున్నది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు రాబోయే ఎడాది కాలం అత్యంత కీలకం కాబోతున్నది.

వరుసగా లోక్ సభ, మున్సిపాలిటీ, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తాజాగా వెలువడి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే గులాబీ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో రాబోయే ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ను కాపాడుకోవాలంటే అప్పటి వరకు ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ద్వితియశ్రేణి లీడర్లు అధికార పార్టీ వైపు మళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు అనేది బీఆర్ఎస్ లో చర్చనీయాశంగా మారింది.

కేటీఆర్ వైపే మొగ్గు?:

అసెంబ్లీ ఎన్నికలకు నిన్న ఫలితాలు వెలువడటంతో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ భేటీకి బీఆర్ఎస్ తరపున ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, మాజీ మంత్రులు పలువురు కీలక నేతలతో పాటు ఎమ్మెల్సీ కవిత సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యచరణతో పాటు బీఆర్ఎస్ ఎల్పీ నేత ఎవరనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎవరు అనేదానిపై కూడా ప్రస్తావనకు రాగా మెజారిటీ ఎమ్మెల్యేలు కేటీఆర్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే వరుస ఎన్నికల నేఫథ్యంలో ఆలోపు పార్టీ తిరిగి పుంజుకోవాలంటే ప్రభుత్వ వ్యవహారాలు, వ్యవస్థలపై పూర్తి స్థాయిలో పట్టు ఉన్న కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారా లేక ఎమ్మెల్యేల ఆలోచన మేరకు కేటీఆర్ కే ఆ పనిని అప్పగిస్తారా అనేది వేచి చూడాలి.

Advertisement

Next Story