- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Koushik Reddy: కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay)తో ఘర్షణ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Koushik Reddy)ని జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు కరీంనగర్ (Karimnagar) రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ (Additional Judicial Magistrate) ఎదుట హాజరుపర్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డిపై నమోదైన రిమాండ్ రిపోర్ట్ (Remand Report)ను కొట్టివేశారు. ఆయనపై నమోదైన మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు. అదేవిధంగా కౌశిక్‌రెడ్డి (Koushik Reddy) రూ.10 వేల చొప్పున మూడు, రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, కరీంనగర్ (Karimnagar)లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay)తో పాడి కౌశిక్‌రెడ్డి (Padi Koushik Reddy) వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తదితరుల సమక్షంలోనే సంజయ్‌ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. బీఆర్‌ఎస్ (BRS)లో గెలిచి కాంగ్రెస్ (Congress)లో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay)పై దాడి చేశారంటూ ఆయన పీఏ (PA), సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో (RDO) కరీంనగర్ (Karimngar) వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (MLA Koushik Reddy)పై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయనను సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేసి కరీనంగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.