- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పండగ పూట దారుణం.. తండ్రిని హతమార్చిన కొడుకు..
X
దిశ, శామీర్ పేట్ : శామీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ రోజున కన్న కొడుకే తండ్రిని హత్య చేసిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. శామీర్ పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శామీర్ పేట్ మండల కేంద్రం పెద్దమ్మ కాలనీలో నివాసముంటున్న అలకుంట్ల హనుమంతు (50) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై రోజు తాగి వచ్చి ఆ మైకంలో ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. సంక్రాంతి పండుగ రోజున కూడా ఇదే సీన్ రిపీట్ కావడంతో ఆవేశానికి గురైన తన కొడుకు ఆలకుంట్ల నర్సింగ్ రావు రోకలి బండతో తండ్రి హనుమంతును కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story