- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mauni Amavasya 2025: మౌని అమావాస్య రోజున ఈ పనులు అస్సలు చేయకండి.. కాదని చేస్తే నష్టమే అంటున్న జ్యోతిష్య నిపుణులు

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి యేటా పుష్యమాసంలో వచ్చే ఆఖరి అమావాస్యను " మౌని అమావాస్య " ( Mauni Amavasya ) అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయాల్లో ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 లో వచ్చే 12 అమావాస్యల్లో ఇది చాలా ప్రత్యేకమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఈ తిథిలో మౌనవ్రతం చేస్తారు. అందుకే, దీనికి " మౌని అమావాస్య" అనే పేరు వచ్చింది. అయితే, ఈ ఏడాది జనవరి 29 న వచ్చింది. ఈ రోజున విష్ణువుకు పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి.
పితృ దోషాలు తొలగించడానికి ఈ రోజే మంచిది. తర్పణాలు, పిండ ప్రదానాలు చేయటానికి ఈ సమయం అనుకూలమైది. అంతే కాదు, ఈ రోజున విష్టువుకు పూజ చేసి ఉపవాసం చేస్తే మంచి జరుగుతుంది. ఈ రోజంతా మౌనవ్రతాన్ని చేయాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉన్నంత వరకు ఉంటే మౌనంగా ఉంటే చాలు. ఈ తిథి నాడు బ్రహ్మ ముహూర్త స్నానం చేయాలి. అలానే, దానం చేసే సమయంలో మౌనంగా ఉండాలని పండితులు చెబుతుంటారు.
మౌని అమావాస్య రోజున రావిచెట్టును పూజిస్తే పాపాలు తొలగిపోతాయి. దీపం వెలిగించి 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజు మూగ జీవాలను హింసించకూడదు. వాటికీ ఆహారం అందిస్తే చాలా మంచిది. అలాగే, ఈ రోజంతా నోటిని అదుపులో పెట్టుకోవాలి అసభ్యకరమైన మాటలు అస్సలు మాట్లాడకూడదు. మనసులో భగవంతుడి రూపం మాత్రమే ఉండాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.