భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన యంగ్ హీరో..? ఏకంగా అన్ని కోట్లు..!

by Kavitha |
భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన యంగ్ హీరో..? ఏకంగా అన్ని కోట్లు..!
X

దిశ, సినిమా: ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్(AGS Entertainments) నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’(Love Today). ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) సినిమాను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ మూవీతోనే ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే హీరో, హీరోయిన్(ఇవాన్) గ్రాఫ్ కూడా ఈ చిత్రంతోనే చేంజ్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్‌కి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా ప్రస్తుతం ఆయన ‘డ్రాగన్’(Dragon), ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

దీంతో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీగా క్రేజ్ పెరిగిపోవడంతో హీరో ప్రదీప్ రంగనాథన్ తన రెమ్యునరేషన్ పెంచేశాడట. తాను నటించబోయే సినిమాలకు ఏకంగా రూ. 18 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. మరి ఈవార్తల్లో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed