Chandrababu: జర్నలిస్ట్ గోపాల ప్రసాద్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

by Ramesh Goud |
Chandrababu: జర్నలిస్ట్ గోపాల ప్రసాద్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ పాత్రికేయులు గోశాల ప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Lokesh Nara) సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా విడివిడిగా ప్రత్యేక ట్వీట్లు చేశారు. సీఎం చంద్రబాబు.. నాలుగు దశాబ్దాల పాటు జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకునిగా సేవలందించి సమాజ హితం కోసం పాటుపడిన గోశాల ప్రసాద్(Goshala Prasad) మృతిDied) విచారకరమని అన్నారు. అలాగే గత ప్రభుత్వ విధ్వంసకర పాలనపై దైర్యంగా గళమెత్తిన ప్రసాద్ లోతైన విశ్లేషణలతో తనదైన ముద్ర వేస్తూ ప్రజాపక్షాన పనిచేసారని కొనియాడారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అలాగే నారాలోకేష్ స్పందిస్తూ.. గోశాల ప్రసాద్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, నాలుగు దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో పనిచేసిన ప్రసాద్ అందరికీ సుపరిచితులని తెలిపారు. అలాగే టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తనదైన విశ్లేషణలతో గత ప్రభుత్వ విధ్వంస విధానాలను తీవ్రంగా నిరసించారని, ప్రజల పక్షాన నిలిచి వారి అభ్యున్నతికి కృషిచేశారని కీర్తించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed