- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అరే ఏంట్రా ఇది.. మరీ ఇలా తయారయ్యారేంటి..

దిశ, వెబ్‌డెస్క్ : చోరీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక ఇళ్లు, కార్యాలయాలు,దేవాలయాలు, దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో ఇలా కనిపించిన ప్రతి చోట దొంగతనం చేస్తున్నారు. ప్రతి చోట లూఠీ చేసే వరకు మనశ్శాంతి లభించదనుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారికి అందినకాడికి దోచుకొని అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు.
దొంగలు ఒక్కొక్కసారి సరిగ్గా ప్లాన్ చేయక దొరికిపోతుంటారు. అలాంటి ఓ చోరీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలో ఓ పెట్రోల్ బంకులో దొంగలు చోరీకి యత్నించారు. అమ్రోహాలోని పెట్రోల్ బంకుకు ఇద్దరు వ్యక్తులు బైక్ తీసుకొని వచ్చారు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది వారి బైక్ కు పెట్రోల్ కొట్టారు. అనంతరం పెట్రోల్ బంక్ సిబ్బంది డబ్బులు అడగగా.. చేంజ్ లేవన్నారు. అయితే పెట్రోల్ బంక్ తాత చేంజ్ కోసం తన జేబులో ఉన్న డబ్బులను బయటికి తీశాడు. ఈ క్రమంలో ఇదే మంచి సమయం అనుకొని బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంక్ సిబ్బంది నుంచి డబ్బులు లాక్కున్నారు. అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది నిందితులను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాలకు చేరుకున్న ఆయా పరిధిలోని పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలను తెలసుకున్నారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రతస్తుం సోషల్ మీడియాలో వీడీయో వైరల్‌గా మారగా..దొంగలను పట్టుకున్న తాతను అందురూ' శభాష్ తాత 'అని పొగుడుతున్నారు