మళ్లీ నీటి పంచాయితీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

by srinivas |   ( Updated:2025-01-15 05:44:39.0  )
మళ్లీ నీటి పంచాయితీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ(Water Panchayat) మళ్లీ మొదలైంది. తెలంగాణ(Telangana)లో సాగు విస్తీరం ఎక్కువ ఉంది కాబట్టి మరిన్ని నీళ్లు కావాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తోంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డు(Krishna River Board) ఇప్పటికే చర్చించింది. అయితే ఏపీ(Ap), తెలంగాణ(Telangana) ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపించడంతో ఈ పంచాయితీ సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరింది. కృష్ణా జలాల వివాదంపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది.

మంత్రి ఉత్తమ్ సమీక్ష


ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)సమీక్ష నిర్వహించారు. కృష్ణానది జలవివాదంపై ఉన్నతాధికారులు, న్యాయవాదులతో చర్చించారు. కృష్ణానది జలవివాదంపై దిశ నిర్దేశం చేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపిస్తామని సూచించారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకున్న ప్రతిపాదననను తాము అంగీకరించడలేదని తెలిపారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా తీవ్రంగా ప్రయత్నం చేయాలన్నారు. నీళ్లలో మెజార్టీ వాటా దక్కాలని ఉన్నతాధికారులు, న్యాయవాదులకు ఉత్తమ్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed