Haryana BJP : హర్యానా బీజేపీ అధ్యక్షుడుపై గ్యాంగ్ రేప్ కేసు!

by Y. Venkata Narasimha Reddy |
Haryana BJP : హర్యానా బీజేపీ అధ్యక్షుడుపై గ్యాంగ్ రేప్  కేసు!
X

దిశ, వెబ్ డెస్క్: హర్యానా బీజేపీ అధ్యక్షుడుపై సామూహిక అత్యాచారం కేసు నమోదవ్వడం సంచలనం రేపింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఓ హోటల్ లో బీజేపీ హర్యానా అధ్యక్షుడు(Haryana BJP President) మోహన్ లల్ బదోలీ(Mohan Lal Badoli), సింగర్ జై భగవాన్ అలియాస్ రాకీ మిట్టల్(Rocky Mittal)లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు(Case Registration , Investigation) ప్రారంభించారు.

బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు వీడియో కూడా చిత్రీకరించారు. బదోలీ, రాకీలపై నమోదైన ఎఫ్ఐఆర్‌కు సంబంధించిన కాపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. బాధితురాలు తన బాస్, స్నేహితుడితో కలిసి హిమాచల్ ప్రదేశ్‌ సోలాన్ జిల్లా కసౌలిలోని హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవల్మప్మెంట్ కార్పోరేషన్ రోస్ మాన్ హోటల్‌లో ఉండగా 2023 జులై 3న నిందితులు ఆమెను కలిశారు. బదోలీ తనను తాను రాజకీయ నేతగా, రాకీ సింగర్‌గా పరిచయం చేసుకున్నారు.

ఈ క్రమంలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బదోలీ, తన మ్యూజిక్ ఆల్బమ్స్‌లలో చాన్స్ ఇస్తానని రాకీ బాధితురాలికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితుడితో కలిసి వారి గదిలోకి వెళ్లింది. అక్కడ ఆమెతో వారు బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశారు. అందుకామె అంగీకరించకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. లైంగికదాడి ఘటనను వారు వీడియోలు, ఫొటోలు తీశారని, ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరించారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

రెండు నెలల క్రితం రాకీ తనను పంచకుల లోని ఆయన ఇంటికి పిలిచాడని, తప్పుడు కేసులో జైలుకు పంపుతానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. నిందితులపై 376డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. కాగా బాధిత మహిళ ఆరోపణలను మోహన్ లల్ బదోలీ కొట్టిపారేశారు.

Advertisement

Next Story

Most Viewed