Real Estate: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మహిళలు ఎంత మంది ఉన్నారో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా

by Vennela |
Real Estate: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మహిళలు ఎంత మంది ఉన్నారో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా
X

దిశ, వెబ్ డెస్క్ : Real Estate: భారతదేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం(Real estate) లాభాల బాటలోనే పయనిస్తుంది. అయితే ఈ రంగంలో రాణించాలంటే చదవు కంటే ఎక్కువగా తెలివితేటలు ఉండాలి. రియల్ ఎస్టేట్(Real estate) అనగానే ముఖ్యంగా పురుషులే ఈ వ్యాపారానికి అర్హులు అనుకుంటుంటారు. కానీ భారత దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే ఆడవాళ్ల సంఖ్య ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

భారతదేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం(Real estate) మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అయితే ఈ రంగంలో మహిళలు ఎక్కువ చొరవ తీసుకోవాల్సిన రంగంగా నిలుస్తోంది. భారత రియల్ ఎస్టేట్ రంగం(Real estate)లో పనిచేసే 7.1 కోట్ల కార్మికుల్లోకేవలం 70లక్షల మంది మహిళలు మాత్రమే ఉన్నారని తాజాగా ఓ రిపోర్టు వెల్లడించింది. మ్యాక్స్ ఎస్టేట్స్, ఇన్ టాండమ్ గ్లోబల్ కన్సల్టింగ్(Max Estates, in tandem with Global Consulting) కలిసి కాంక్రీట్ చేంజ్ మెరుగైన వేతన సమానత్వం, మహిళల సమానతను రియల్ ఎస్టేట్ లో చేర్చడం అనే రిపోర్టును రిలీజ్ చేసింది. ఈ నివేదికలో రియల్ ఎస్టేట్ రంగం ఇంకా సమానత్వాన్ని సాధించడంలో చాలా దూరం ఉందని సూచించింది.

అయితే ఈ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం భారతదేశ జనాభాలో మహిళలు 48.5శాతం ఉండగా..అందులో సుమారు 1.2శాతం మాత్రమే రియల్ ఎస్టేట్(Real estate) రంగంలో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. మహిళల తక్కువ ప్రాతినిధ్యం అన్ని స్థాయిల్లో సమానమైన వేతనాలు లేని సమస్య రియల్ ఎస్టేట్ రంగంలో ఎదురయ్యే అత్యంత పెద్ద సవాళ్లలో ఒకటిగా పేర్కొంది. ఒక పెద్ద ఉద్యోగ అవకాశాన్ని కల్పించే రంగం అయినప్పటికీ, మహిళల కోసం అత్యంత సరిహద్దులు ఉన్న రంగంగా రియల్ ఎస్టేట్ అంగీకరించింది. లింగ వివక్షతను పరిష్కరించడం వల్ల పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. ఇది ప్రొడెక్టివిటీ(Productivity)ని, ఆవిష్కరణను లాభాదాయకతను పెంచుతుందని నివేదిక పేర్కొంది.

ఇక రియల్ ఎస్టేట్ రంగం(Real estate) కీలకమైన సవాళ్లను కూడా ఎదుర్కుంటుంది. ప్రత్యేకంగా లింగ వివక్షత సంబంధిత సమస్యలతో పాటు ఈ రంగంలో సుమారు 71 మిలియన్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వాటిలో కేవలం 7 మిలియన్ మాత్రమే ఉన్నారు. దీని వల్ల మహిళా శ్రమ వ్యవస్థలో పాల్గొనే రేటు 25.1శాతం మాత్రమే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించింది. మహిళల కోసం ప్రత్యేకమైన స్కిల్స్ అభివ్రుద్ధి(Development of specialized skills), శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రిపోర్టు సూచించింది. అలాగే సాంకేతికతలో సమగ్రత(Integrity in technology), నాయకత్వ పాత్రలపై మహిళలకు అవకాశాలు కల్పించడం ఈ మార్పు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. మరింత సమగ్రత, మెరుగైన వేతన సమానత్వం ఉంటే మహిళలు ఈ రంగంలో మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంది.

Next Story

Most Viewed