- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Kumbh Mela - Harsha Richhariya: కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా సాథ్వి.. గూగుల్‌లో ఎగబడి వెతుకుతున్నారుగా
Kumbh Mela - Harsha Richhariya: ఈసారి కుంభమేళాకు మహిళలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. వారిలో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన హర్ష రిచారియా(Harsha Richhariya) కుంభమేళాKumbh Mela) లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె చేస్తున్న సందడి గూగుల్లో ఎగబడి వెతికేలా చేస్తోంది.
హర్ష రిచారియా..ఉత్తరఖాండ్ కు చెందిన ఈ యాంకర్ కు ఇన్ స్టాగ్రామ్ లో 12 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. కుంభమేళాకు వచ్చిన భారీ ర్యాలీతో కలిసి ఆమె ప్రయాగ్ రాజ్ కు వచ్చారు. రిచారియా(Richhariya) సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మాత్రమే కాదు..ప్రొఫెషనల్ హోస్ట్ కూడా. ఆమె మహాకుంభమేళాకు రావడంతో..ఆమె వీడియోలు, ఫొటోలు చూసేందుకు నెటిజన్లు గూగుల్లో జోరుగా సెర్చ్ చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఓ వర్గం రిచారియా పాత ఫొటోలు, వీడియోలను మళ్లీ రీపోస్టు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆమెను తిట్టిపోస్తున్నారు. ఆమె సాథ్వి కాదనీ..మోడల్, ప్రొఫెషనల్ హోస్ట్(Professional host) అంటున్నారు. కుంభమేళా(Kumbh Mela)ను కూడా తన ప్రమోషన్ కోసం వాడేసుకుంటోందని ఫైర్ అవుతున్నారు. ఆమె సాథ్వి అవతారం ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అంటున్నారు.
30 ఏళ్ల రిచారియా తాజాగా ప్రయాగ్ రాజ్(Prayagraj) లో తాను చేస్తున్న పనులకు సంబంధించి ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆమె ఇటీవలి ఫొటోలను జాగ్రత్తగా గమనిస్తే.. ఆమె చాలా ఆలయాలను సందర్శించినట్లు తెలుస్తోంది. చాలా చోట్ల ఆమె ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఆధ్యాత్మిక గురువులను కలుస్తున్నారు. రిచారియా రెండేళ్ల క్రితం ఆధ్యాత్మిక భావాల(Spiritual feelings)ను అందుకున్నారని..అన్నీ వదులుకుని..ఈ కొత్త గుర్తింపును నేను అలవాటు చేసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఆమె ఆచార్య మహామండలేశ్వర్ శిష్యురాలు(Disciple of Acharya Mahamandaleshwar). ఆమె తన ఇన్ స్టాలో తనను తాను హిందు సనాతన షేర్నీ(Hindu Sanatana Sherni) అని చెప్పుకుంటున్నారు.
మోడల్‌గా ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్‌లో ఉన్నా కాస్త ఒంటరిగా ఉండేదానిని. నా మొత్తం జీవితంలో ఎప్పుడూ నైట్ పార్టీ చేసుకోలేదు. ఇప్పటి వరకు నేను ఒక స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి, ఒక స్నేహితుడి వివాహానికి హాజరయ్యాను. వ్యక్తిగతంగా సామాజిక జీవితానికి దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను చేస్తున్న పని నాకు చాలా ఇష్టం. గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. నా ఆత్మకు సంతృప్తిని ఇస్తుంది. భజనలు చేయడం, దేవాలయాల్లో ఉండడం, ఋషులు, సాధువుల ఆశీర్వాదం పొందడం, ఇలాంటి శాంతిని నేను ఎప్పటికీ విడిచిపెట్టకూడదనుకుంటున్నాను అని రిచారియా తెలిపారు.
నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను. నేను బుందేల్‌ఖండ్(Bundelkhand) (ఝాన్సీ సమీపంలోని మౌ రాణి పూర్)లో పుట్టాను. నా కుటుంబం మతం, సంస్కృతిని అనుసరించాలని కోరుకుంటుంది. నా వృత్తి, నేను నా కోసం మోడలింగ్ చేశాను. నా కుటుంబం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నా తల్లిదండ్రులు, సోదరుడు ఎల్లప్పుడూ నాకు సపోర్టుగా ఉన్నారు. నేను నిజంగా సన్యాసిని కాలేను అని వారు కొంచెం ఫీల్ అవుతున్నారు. నేను భోపాల్‌లో పాఠశాల విద్యను అభ్యసించానని..నా యాంకరింగ్ భోపాల్ నుండే మొదలైందని చెప్పుకొచ్చారు రిచారియా.
అయితే గతేడాది ఆగస్టులో ఆమె ఓ ర్యాలీలో పాల్గొన్నారు. కోల్ కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో రేప్, మర్డర్ అయిన 31ఏళ్ల జూనియర్ వైద్యురాలికి సంఘీభావంగా ఆ క్యాండిల్ ర్యాలీ జరిగింది. అందులో రిచారియా(Harsha Richhariya) పాల్గొన్నట్లు ఓ వీడియో ఉంది. అంతేకాదు ఆమె నవంబర్ లో బ్యాంకాక్, మయన్మార్ లో జరిగిన ఇండియన్ వెడ్డింగ్ (Indian Wedding)కు హోస్టుగా చేసినట్లు ఫొటోలను చూస్తే అర్థం అవుతోంది.
తాజాగా రిచారియా ఆధ్యాత్మిక గురువు వ్యాసానంద గిరి మహరాజ్(Spiritual guru Vyasananda Giri Maharaj) ను సత్కరిస్తూ ప్రయాగ్ రాజ్ లో జరిగిన ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్(Laurene Powell, wife of Apple co-founder Steve Jobs) కూడా పాల్గొన్నారు.