Kotnak Jangu: విషాదం..గోండి లిపి సృష్టికర్త కోట్నాక్ జంగు కన్నుమూత

by Maddikunta Saikiran |
Kotnak Jangu: విషాదం..గోండి లిపి సృష్టికర్త కోట్నాక్ జంగు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్:గోండి లిపి(Gondi Script) సృష్టికర్త, గిరిజన పండితుడు(Tribal Scholar) 86 ఏళ్ల కోట్నాక్ జంగు(Kotnak Jangu) తుదిశ్వాస విడిచారు.ఆదిలాబాద్‌(Adilabad)లోని నార్నూర్(Narnoor) మండలం గుంజాల(Gunjala) గ్రామానికి చెందిన జంగు గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని ఆదివాసీ జాతి(Adivasi Race)కి చెందిన చిన్నారుల కోసం ఆయన ఎనలేని కృషి చేశారు.వారి కోసం గోండి-తెలుగు వాచకాలను ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు ప్రచురించారు. అలాగే ఆదివాసీ చిన్నారుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేశారు.ఆయన చేసిన శ్రమను ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ రావు (Jayadheer Tirumala Rao) గుర్తించి ఎంతో సహకరించారు.కాగా జంగు మృతి పట్ల ఆదివాసి పెద్దలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

గోండి భాష(Gondi Language)ను రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 20 లక్షల మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఇది ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్‌లలో మాట్లాడే మధ్య ద్రావిడ భాష. 2006లో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు నేతృత్వంలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల అనే గ్రామంలో సుమారు 1750 నాటి మాన్యుస్క్రిప్ట్‌(Manuscripts)లను కనుగొంది. మాన్యుస్క్రిప్ట్‌లు తెలియని లిపిలో వ్రాయబడ్డాయి, దానికి వారు గుంజల గోండి(Gunjala Gondi) అని పేరు పెట్టారు.గుంజాల గోండిలో అనేక పుస్తకాలు ప్రచురించబడ్డాయి.అలాగే ఆంధ్ర ప్రదేశ్‌(AP)లోని కొన్ని పాఠశాలల్లో గోండి భాష బోధించబడుతోంది.గుంజల గోండిని గుంజల గోండి లిపి లేదా కోయితుర గుంజల లిపి అని కూడా పిలుస్తారు.

Next Story

Most Viewed