Koppula Eshwar Vs Thalasani Srinivas Yadav.. మంత్రుల మధ్య పంచాయితీ

by Nagaya |   ( Updated:2022-12-13 05:36:08.0  )
Koppula Eshwar Vs Thalasani Srinivas Yadav.. మంత్రుల మధ్య పంచాయితీ
X

దిశ,తెలంగాణ బ్యూరో: మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. తన శాఖలో తలసాని జోక్యం ఎక్కువైందని కొప్పుల గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇది ఒకసారి కాదని, రెగ్యూలర్‌గా జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ఏటా మైనారిటీ డిపార్ట్‌మెంట్ నుంచి క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నది. ఇందుకు నిధులు విడుదల చేసి హైదరాబాద్‌లో పెద్దఎత్తున్న డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మైనారిటీ శాఖ ఈశ్వర్ పరిధిలో ఉన్నది. క్రిస్మస్ వేడుకల నిర్వహణ, ఆ వర్గం వారితో సమావేశాలు ఆయనే నిర్వహించాలి. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ వేడుకులపై రివ్యూ నిర్వహించేందుకు రెడీ అయినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ఈనెల 15న సంక్షేమ భవన్‌లో మీటింగ్ నిర్వహిస్తున్నామని, ఈ మీటింగ్‌కు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నట్టు ఆయన పెషీ నుంచి మైనారిటీ శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయం తెలుసుకున్న కొప్పుల 'తన శాఖలో ఆయన జోక్యం ఏంటీ?.. లాస్ట్ ఇయర్ సైతం ఇలాగే చేసిండు? సోమవారం జరిగిన క్రిస్టియన్ భవన్ శంకుస్థాపన విషయంలో అలాగే చేసిండు. నాకు తెలియకుండానే శంకుస్థాపన పొగ్రామ్‌పై ఆఫీసర్లతో రివ్యూ పెట్టిండు.' అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు కొప్పుల రెడీ అయినట్టు సమాచారం.

ఇన్‌చార్జి మంత్రిగా రివ్యూ

హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నందునే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ వేడుకలపై రివ్యూ చేసినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రంలో క్రిస్టియన్లు ఎక్కువగా ఉండేది హైదరాబాద్‌లోనే, అందుకే తాము రివ్యూ చేశామని, లేకపోతే ఆ విషయంలో తాము జోక్యం చేసుకోబోమనే అభిప్రాయంలో తలసాని ఉన్నట్టు తెలిసింది.

Read More....

యాత్రల ట్రెండ్ చేంజ్! 30 రోజుల్లో హీటెక్కనున్న తెలంగాణ రాజకీయం

Advertisement

Next Story

Most Viewed