- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి సీరియస్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్ వద్దకు వెళ్లి కొనుగోళ్లపై ఆరా తీశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. రుణమాఫీ లేదు, బోనస్ లేదు అంతా బోగస్ మాటలు అగి కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డి తరచూ దేవుళ్లపై ఒట్టు పెడుతున్నాడు.. దేవుళ్లపై ఒట్లు పెడితే రైతుల సమస్యలు తీరవని చురకలు అంటించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులు పండించిన ప్రతి గింజను కొనడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన వరిని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సన్నరకం పేరుమీద.. దొడ్డు వడ్ల రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను, ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.