- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Formula E-Race Case: ఏసీబీ, ఈడీ విచారణకు హాజరైన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race Case) కేసులో పరిణామాలు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ (Aravind Kumar) ఇవాళ బంజారా హిల్స్ (Banjara Hills) లోని ఏసీబీ (ACB) కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంఏ అండ్ యూడీ (MA & UD) శాఖలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఫార్ములా ఈ-రేసు అగ్రిమెంట్ సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.
మరోవైపు ఇదే కేసులో మనీ లాండరింగ్ (Money Laundering), ఫెమా నిబంధనలను (FEMA Regulations) ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని ఈడీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే ఆయన ఈడీ (Enforcement Directorate) అధికారుల ఎదుట ఫార్ములా ఈ-రేసుకు సంబంధించి కీలక పత్రాలతో విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేసు 2 అగ్రిమెంట్ సమయంలో డబ్బు బదిలీలో బీఎల్‌ఎన్ రెడ్డి (BLN Reddy) కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. రేసు నిర్వహణకు ఫైల్ మూవ్ చేసినప్పుడు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఎందుకు తీసుకోలేదని ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది. విదేశాలకు నిధులు ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఆర్‌బీఐ (RBI) అనుమతి ఎందుకు తీసుకోలేదు? అనే అంశాలపై బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.
కాగా, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. కాగా, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a), (13)2, IPCలోని సెక్షన్ 409 రెడ్ విత్ 120-B ప్రకారం ఇప్పటికే ఏసీబీ కేసులు నమోదు చేసింది. అయితే, కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది.