- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kishan Reddy: కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్(Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో కులం, మతం పేరుతో కాంగ్రెస్ విష ప్రచారం చేసిందని అన్నారు. అయినా ప్రజలు నమ్మలేదని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో వరుసగా బీజేపీ(BJP) గెలుస్తూ వస్తోందని చెప్పారు. దేశంలో కేవలం మూడు రాష్ట్రాలకే కాంగ్రెస్(Congress) పరిమితం అయిందని అన్నారు.
గ్యారంటీలతో మభ్యపెట్టి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో గెలిచారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌పై నమ్మకం ఉంచారని అన్నారు. గతంలో కంటే అత్యధిక ఓట్లు, సీట్లను ప్రజలు బీజేపీ కూటమికి కట్టబెట్టారని తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా వచ్చేలా లేవని విమర్శించారు.