పీవీకి భారతరత్నపై కిషన్ రెడ్డి రియాక్షన్

by Prasad Jukanti |
పీవీకి భారతరత్నపై కిషన్ రెడ్డి రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో:మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం తెలుగు ప్రజలందరూ గర్వపడాల్సిన విషయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పీవీ దూరదృష్టి నాయకుడే కాకుండా దేశానికి అనేక సేవలు చేశారని కొనియాడారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు పీవీ నరసింహారావును ఎదిగారని అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే మోడీ సర్కార్ గౌరవించిందన్నారు. బానిస ఆలోచన విధానానికి ఆనవాళ్లుగా ఉన్న వాటిని మోడీ ప్రభుత్వం తొలగిస్తూ మార్పులు తీసుకువస్తోందన్నారు. ఈ మార్పులలో భాగంగానే పీవీతో పాటు కర్పూరి ఠాకూర్, ఎల్ కే అద్వానీ, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న అవార్డుతో గౌరవించుకుంటున్నామన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలు మోడీకి సపోర్ట్ చేయాలి:

బీఆర్ఎస కార్యకర్తలు రాష్ట్రం, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ నాయకత్వానికి మద్దతు తెలపాలని కిషన్ రెడ్డి కోరారు. జాతీయ రాజకీయాల పేరుతో ఏర్పడిన బీఆర్ఎస్ ది అసందర్భం రాజకీయంగా అభివర్ణించారు. ఆ పార్టీ మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలకు తాళం వేశారని ఎద్దేవా చేశారు. త్వరలో తెలంగాణలోనూ ఆ పార్టీ ఆఫీస్ కు తాళం వేయడం ఖాయం అన్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించామని త్వరలోనే అభ్యర్థుల ప్రకటిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed