- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీపై నిప్పులు చెరిగిన KCR.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ డిబేట్‌లో బీజేపీపై నిప్పులు చెరిగారు. లిక్కర్ స్కామ్ కేసు అంతా ఫేక్ అని.. అది ప్రధాని మోడీ సృష్టించిన కేసు అని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేతపై కేసు పెట్టడంతో ప్రధాని మోడీ తనపై కక్ష కట్టారని.. అందుకే లిక్కర్ స్కామ్ కేసులో తన కూతురు కవితను అరెస్ట్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని.. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ గురించి మాట్లాడే హక్కు అసలు కేసీఆర్‌కు లేనే లేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవదు అంటున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తనకు మంచి మిత్రుడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ బలవంతంగా తనపై పోటీకి దించారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు. దేశ ప్రజలు మళ్లీ ప్రధాని మోడీకే పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.