ధరణి పాపం సోమేష్​కుమార్​దే.. కిసాన్​కాంగ్రెస్ అధ్యక్షుడు​కోదండరెడ్డి

by Javid Pasha |
ధరణి పాపం సోమేష్​కుమార్​దే.. కిసాన్​కాంగ్రెస్ అధ్యక్షుడు​కోదండరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పాపం సోమేష్​కుమార్​దేనని కిసాన్​కాంగ్రెస్​అధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సోమేష్​కుమార్​అతి పెద్ద తిమింగలం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సలహాలతోనే సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు 22 లక్షల రైతు కుటుంబాలకు హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. దీంతో తప్పకుండా కేసీఆర్​ కు రైతుల సెగ తగులుతుందన్నారు.విఆర్ఓ వ్యవస్థ రెవిన్యూ వ్యవస్థలో కీలకమైనదని,దాన్ని రద్దు చేయడం వలన ప్రజలకు నష్టం అని పేర్కొన్నారు.అనుకూలమైన అధికారులకు ధరణి వ్యవస్థను కేసీఆర్ అప్పగించారన్నారు. దీని వలన కొందరు ఆఫీసర్లకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇదంతా ఆంద్రా క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్ సలహాలే అన్నారు.

సోమేష్ కుమార్ పై కేసీఆర్ కు ఎందుకు అంత ప్రేమ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి అవకతవకలపై విచారణ చేస్తామన్నారు. అంతేగాక కాంగ్రెస్ అధికారంలో వస్తే భూ గ్యారంటీ చట్టం తీసుకువస్తామన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​మాట్లాడుతూ...వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ను రైతులు ఇంటికి పంపడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నారు. కేసీఆర్ సర్కార్ తెచ్చిన ధరణి వలన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు రూ.10 వేల నష్ట పరిహారం ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed