లేగ దూడను చంపింది.. హైనానా లేక చిరుత పులా?

by Sathputhe Rajesh |
లేగ దూడను చంపింది.. హైనానా లేక చిరుత పులా?
X

దిశ, తలకొండపల్లి: గుర్తు తెలియని జంతువు దాడిలో లేగ దూడ చనిపోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని కోరింతకుంట గ్రామపంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. గ్రామానికి అర కిలోమీటరు దూరంలో భీమా నాయక్ అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో రాత్రి గుర్తుతెలియని జంతువు దాడి చేసి లేగ దూడను చంపింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. బీమా నాయక్‌‌‌కు చెందిన సుమారు 5 పశువులు ఉండగా రోజువారీగా ఆ పశువులను తన వ్యవసాయ క్షేత్రంలోనే కట్టేసి రాత్రివేళ ఇంటికి వస్తుంటారు.

బుధవారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లి చూడగా గుర్తుతెలియని జంతువు దాడి చేసి లేగ దూడను చంపేసిందని బాధితుడు ఆవేదనతో తెలిపాడు. లేగ దూడను చంపి చోట జంతువు పాదముద్రలు కనిపిస్తున్నాయి. లేగ దూడను చంపిన జంతువు చిరుత పులా లేక హైనానా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాలలో కుక్కలు విజృంభించి మేకలను గొర్రెలను చంపి వేసిన సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అంశంపై ఫోకస్ చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Next Story