- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి : ఎమ్మెల్యే కాంతారావు
దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వీరు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ఉద్యోగ, విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో వారు ముందుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వీరి అభివృద్ధి కోసం రూ.వేలకోట్ల నిధులను ఖర్చు పెడుతూ వారి అభివృద్ధికి నిరంతర కృషి చేస్తుందని గుర్తు చేశారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని చెప్పారు. రాజకీయ రంగంలో కూడా రాణించే విధంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తారని కొనియాడారు. కార్యక్రమంలో మణుగూరు డీఎస్పి రాఘవేంద్రరావు, అశ్వాపురం సీఐ సీహెచ్. శ్రీనివాసరావు, ఎస్ఐలు జితేందర్ సురేష్ కుమార్, అశ్వాపురం జెడ్పీటీసీ సూది రెడ్డి సుజాత సులక్షణగోపిరెడ్డి, ఎంపీపీ ముత్తినేని సుజాత, స్థానిక సర్పంచ్ భాను శారద తదితరులు పాల్గొన్నారు.