- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్యాస్ లీకై రెండు ఇళ్లు దగ్ధం
దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామ శివారులో గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించి రెండు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. బాల శ్రీనివాసరావు, బాట్ల చెన్నారావు అనే ఇద్దరు గొర్రెల కాపరులు ఎనిమిదేళ్ల క్రితం ఏలూరు జిల్లా నుండి వలస వచ్చి గొర్రెల పెంపకం తో పాటు కొంత వ్యవసాయం చేస్తూ రంగువారి గూడెం గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో బాల శ్రీనివాసరావు, బాట్ల చెన్నరావు వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో ఉండగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక బాల నిహారిక గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగటాన్ని గమనించిన బాలిక తల్లితండ్రుల వద్దకు వెళ్లి సమాచారం ఇచ్చింది.
ఇంటికి చేరుకునే సమయానికి మంటలు రెండు ఇళ్లకు పూర్తిగా వ్యాపించాయి. అదే సమయంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలుడు దాటికి పక్క పక్కనే ఉన్న రెండు రేకుల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో ఆ రెండు కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. ఈ ప్రమాదంలో బాల శ్రీనివాసరావు ఇంట్లో వ్యవసాయ పనుల కోసం తెచ్చి పెట్టుకున్న లక్ష రూపాయల నగదు, ఇంటి సామగ్రి, బంగారు నాన్ తాడు, పట్టీలతో సహా పూర్తిగా కాలిపోయాయి. బాట్ల చెన్నరావు ఇంట్లోని అరవై మూడు వేల రూపాయల నగదు, ఓ ద్విచక్ర వాహనం, ఓ లేగ దూడ, ఇంట్లో వంట సామగ్రి కాలి బూడిద అయ్యాయి. అయితే చుట్టు పక్కల ఉన్న రైతులు ఇల్లు దగ్దం కావటాన్ని గమనించి పంట పొలాల్లోని మోటార్ల సాయంతో మంటలు ఆర్పివేశారు. కట్టుబట్టలతో బాధితులు రోడ్డున పడ్డారు.