కార్మికుల సమిష్టి కృషితో సింగరేణికి లాభాలు

by Sridhar Babu |
కార్మికుల సమిష్టి కృషితో సింగరేణికి లాభాలు
X

దిశ,సత్తుపల్లి : సింగరేణిలో కార్మికుల సమిష్టి కృషితో అంచలంచెలుగా విస్తరిస్తూ లాభాల బాటలో పయనిస్తుందని ఖమ్మం జిల్లా ఎంపీ రఘురామిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (విద్యుత్ సంస్థ ), కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో ఉజ్వల సింగరేణి - ఉద్యోగుల పాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వారు పాల్గొని మాట్లాడారు.

సింగరేణి సాధించిన విజయాలను గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎండీ బలరామ్ నాయక్, సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణ, సింగరేణి జీఎం షాలేంరాజు, సింగరేణి పీఓ లు ప్రహ్లాద్, నరసింహారావు , కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద్ విజయ్ కుమార్, ఐఎన్ టీయూసీ జనరల్ సెక్రటరీ రజాక్, ఏఐసీటీయూ నాయకులు, స్థానిక ఐఎన్టీయూసీ నాయకులు, సింగరేణి ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed