ప్రజలకు అందుబాటులో ఉండాలి

by Sridhar Babu |
ప్రజలకు అందుబాటులో ఉండాలి
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కోరారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా నిత్యం పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నేర విచారణలో జాప్యం జరగకుండా బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా పనిచేయాలని సూచించారు.

సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్​కు వచ్చిన బాధితులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సిబ్బంది సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమణారెడ్డి సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed