- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
T20 CRICKET: భారత్ టీ20 మ్యాచ్ ఏర్పాట్లు షురూ.. ఉప్పల్ స్టేడియానికి బందోబస్తు ఇవ్వాలని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ రిక్వెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Rajiv Gandhi International Cricket Stadium)లో వచ్చే నెల 12 వ తేదీన జరగనున్న భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ ఏర్పాట్లను ప్రారంభించినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌రావు వెల్లడించారు. స్టేడియానికి పోలీస్ బందోబస్తు ఏర్పాట్ల కోసం మల్కాజ్ గిరి డీసీపీ పద్మజను హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావు, కార్యదర్శి దేవ్‌రాజ్, కౌన్సిలర్ సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా రోజు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని డీసీపీ ని కోరారు. పోలీస్ యంత్రాంగం సహకారంతో ఈ ఏడాది ప్రారంభంలో టెస్ట్ మ్యాచ్, వేసవిలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించామని, వచ్చే నెలలో జరగనున్న టీ20 మ్యాచ్ కూడా అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు.