- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Special Quota for Women Journalists: జర్నలిస్టు స్కీమ్‌లలో మహిళలకు ప్రత్యేక కోటా.. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా జర్నలిస్టుల(Women Journalists) సంక్షేమం(Welfare) కోసం మీడియా అకాడమీ చైర్మన్(Media Academy Chairman)గా తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని, వారి సంక్షేమం కోసం దృష్టి సారిస్తానని శ్రీనివాస రెడ్డి(Srinivasa Reddy) స్పష్టం చేశారు.
బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం జరిగిన మహిళా జర్నలిస్టుల సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరైన ఆయన మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో మహిళలకు ప్రత్యేక కోటా కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మీడియాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుల కోసం, వర్కింగ్ జర్నలిస్టుల చట్టంలోనూ ప్రత్యేక సౌకర్యాలు, రక్షణ కల్పించాలనే నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. మీడియా యాజమాన్యాలు వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నాయనే అంశంలో ఇకపైన ఆరాతీస్తామని తెలిపారు. అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా, వృత్తిలో సీనియారిటీ ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ వేదికగా, జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ నిర్వహించేందుకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) యోచిస్తున్నట్లు తెలిపారు.
మీడియా సంస్థల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ఐక్యమై వారి హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నట్లుగానే.. మహిళా జర్నలిస్టులు కూడా సంఘటితంగా ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ... మహిళా జర్నలిస్టుల భద్రత, సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఇందులో భాగంగానే వారిని ఏకం చేసి, హక్కుల సాధన కోసం పోరాటాల్ని ఉధృతం చేసేందుకు మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కళ్యాణం రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ పొట్లపల్లి స్వరూప, సభ్యులు యశోద, సాజీదా బేగం, తరుణి, ప్రతిభలతో పాటు పలువురు మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు.