Harini Amarasuriya: శ్రీలంక నూతన ప్రధానిగా హరిని అమర సూర్య.. దేశ మూడో మహిళా పీఎంగా రికార్డు

by vinod kumar |
Harini Amarasuriya: శ్రీలంక నూతన ప్రధానిగా హరిని అమర సూర్య.. దేశ మూడో మహిళా పీఎంగా రికార్డు
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక కొత్త ప్రధాన మంత్రిగా హరిణి అమరసూర్య మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఎన్నికైన నూతన అధ్యక్షుడు అనురా దిసనాయకే ఆమె చేత ప్రమాణం చేయించారు. దీంతో ప్రధాని పదవి చేపట్టిన మూడో మహిళగా అమరసూర్య ఘనత సాధించారు. అంతకుముందు సిరిమావో బండారునాయకే, చంద్రికా కుమార్తుంగలు మహిళా పీఎంలుగా విధులు నిర్వహించారు. అలాగే నలుగురు సభ్యులతో కూడిన మంత్రివర్గాన్ని సైతం అనురా నియమించారు. హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించారు. ప్రెసిడెంట్ ఎన్నికల అనంతరం దినేష్ గుణవర్ధనే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరిణి పీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా,1970 మార్చి6న జన్మించిన హరిణి అమరసూర్య డిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. 2011 నుంచి ఆమె అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2020లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా పీఎంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed