పచ్చి కొబ్బరితో మెరిసే జుట్టు, చర్మం మీ సొంతం...

by Sujitha Rachapalli |
పచ్చి కొబ్బరితో మెరిసే జుట్టు, చర్మం మీ సొంతం...
X

దిశ, ఫీచర్స్ : పచ్చి కొబ్బరిని ఉదయం పూట తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలతో కూడిన పోషకాల పవర్‌హౌస్. కాగా దీన్ని ఉదయాన్నే తినడానికి కొన్ని బలమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి.

ఎనర్జీ అండ్ మెమరీ బూస్టర్

పచ్చి కొబ్బరిలోని మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCT) దీర్ఘకాలం శక్తిని అందిస్తాయి. ఇవి మానసిక స్పష్టతకు మద్దతునిస్తాయి. గందరగోళం, బ్రెయిన్ ఫాగ్ వంటి పరిస్థితులను నివారిస్తాయి. కొబ్బరి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ను సరైన పద్ధతిలో ఉంచడం ద్వారా జ్ఞాపకశక్తి మరింత పెరుగుతుంది.

పేగు ఆరోగ్యం

పచ్చి కొబ్బరి తినడం ద్వారా మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వు యాడ్ అవుతుంది. ఉదయాన్నే కొవ్వును తినడం అనేది ప్రేగు ఆరోగ్యానికి వరంగా భావించబడుతుంది. పచ్చి కొబ్బరి పీచు, హెల్తీ ఫ్యాట్ గట్ బ్యాక్టీరియాకు మద్దతునిస్తాయి. జీర్ణక్రియ క్రమబద్ధతను ప్రోత్సహిస్తాయి. కొబ్బరిలో అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

వెయిట్ కంట్రోల్

కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మీ కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. తినలనే కోరికలను తగ్గిస్తాయి. ఆకలి బాధలను అణచివేయడంలో సహాయపడుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ కొబ్బరికాయ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. వేడిని ఉత్పత్తి చేయడానికి కేలరీలను బర్న్ చేసే ప్రక్రియను థర్మోజెనిసిస్ అంటారు. కొబ్బరిలో ఉండే మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) ద్వారా దీనిని వేగవంతం చేయవచ్చు.

బలమైన రోగనిరోధక వ్యవస్థ

పచ్చి కొబ్బరి లారిక్ యాసిడ్ యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరిలోని యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ రోగనిరోధక పనితీరుకు తోడ్పడతాయి.

ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు

కొబ్బరికాయలోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఉదయం పూట మొదట తిన్నప్పుడు చర్మానికి తేమను, పోషణను అందిస్తాయి. కొబ్బరిలోని పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్... జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. జుట్టు పల్చబడటం, రాలడాన్ని తగ్గించడంతోపాటు మెరిసేలా చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed