Supreme court: మీ ఎజెండాలోకి కోర్టును లాగొద్దు.. ఎన్సీపీసీఆర్‌కు సుప్రీంకోర్టు సూచన

by vinod kumar |
Supreme court: మీ ఎజెండాలోకి కోర్టును లాగొద్దు.. ఎన్సీపీసీఆర్‌కు సుప్రీంకోర్టు సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: షెల్టర్‌హోమ్‌ల ద్వారా పిల్లలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణను కోరుతూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్‌) వేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు బీవీ నాగరత్న, కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన బెంచ్ ఎన్‌సీపీసీఆర్ ఎజెండాలోకి న్యాయస్థానాన్ని లాగొద్దని తెలిపింది. పిటిషన్ అస్పష్టంగా ఉందని కాబట్టి దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని వెల్లడించింది. కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (సీపీసీఆర్) చట్టం, 2005 ప్రకారం ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారం బాలల హక్కుల సంఘానికి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్సీపీసీఆర్‌ పిటిషన్‌ను కొట్టి వేసింది. కాగా, మైనర్ల రక్షణకు సంబంధించి రాష్ట్రంలోని సంబంధిత అధికారులు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారని ఎన్సీపీసీఆర్‌ సుప్రీంకోర్టుకు తెలిపింది. షెల్టర్ హోమ్ ల ద్వారా పిల్లలను విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని కోరింది.

Next Story

Most Viewed