ఆ సమాధిలో ప్రపంచంలోనే అత్యంత భారీ సిరి సంపదలు.. కానీ ఎందుకు తెరవట్లేదు?

by Sujitha Rachapalli |
ఆ సమాధిలో ప్రపంచంలోనే అత్యంత భారీ సిరి సంపదలు.. కానీ ఎందుకు తెరవట్లేదు?
X

దిశ, ఫీచర్స్ : చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువంగ్ చక్రవర్తి సమాధి 1974లో కనుగొనబడింది. కానీ దాన్ని తెరిస్తే భారీ ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందనే ఇప్పటివరకు తెరవలేదు పురావస్తు శాస్త్రవేత్తలు. 221BC నుంచి 210 BC వరకు పాలించిన ఈ చక్రవర్తి.. చైనాలోని షాంగ్సి ప్రావిన్స్ లో కనుగొనబడిన టెర్రకోట సైనికులు, గుర్రాల సైన్యం ద్వారా కాపలాగా ఉన్నాడు. అయితే ఈ సమాధి ఓపెన్ చేయడం.. చొరబాటుదారులను చంపేందుకు రూపొందించిన బూబీ ట్రాప్స్ తమపై ప్రయోగించబడే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు. ఇందులోకి ప్రవేశించేవారిపై కాల్పులు జరుపుతున్న క్రాస్ బ్రోలు, బాణాలు ఉన్నట్లు గుర్తించారు.

ఇక పురాతన చైనీస్ చిత్రకారుడు సిమా కియాన్.. ఈ చక్రవర్తి మరణించిన వంద సంవత్సరాల తర్వాత ఓ నోటు రాసుకొచ్చాడు. ఈ సమాధిలో భారీ మొత్తంలో వజ్రాలు, బంగారాన్ని ఉంచారని, క్రాస్ బౌలు సెట్ చేశారని, నదులు సముద్రాలను అనుకరించడానికి పాదరసం ప్రవహించే వ్యవస్థతో సహా ఘోరమైన అచ్చులతో అమర్చబడించిందని తెలిపాడు.

ఒక వేళ క్రాస్ బౌలు పనిచేయకపోయినా ద్రవ పాదరసం గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నారు. కాలక్రమేణా పాదరసం పగుళ్ల ద్వారా బయటకు వచ్చి సంభావ్య ఆరోగ్య ప్రమాదాలను సృష్టిస్తుందని అంటున్నారు. 2020లో ప్రచురించబడిన అధ్యయనంలో సమాధి స్థలం నుంచి పాదరస ఉద్గారాల రుజువులు కనుగొనబడ్డాయి. అయితే నష్టాలను నివారించేందుకు, సమాధిని అన్వేషించేందుకు నాన్ ఇన్వాసివ్ పద్ధతులను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Next Story

Most Viewed