- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సండ్ర
దిశ సత్తుపల్లి: జిల్లాలోని పలు సమస్యలపై ఢిల్లీలోని ట్రాన్స్ పోర్ట్ భవన్ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య , కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా వేంసూరు, కల్లూరు, మండలాల్లో ఎగ్జిట్ లేదని దీనితో ప్రజలకు రాకపోకలు ఇబ్బందులు ఉన్నాయని ఆయనకు విన్నవించారు. గతంలో సమస్యపై పలుమార్లు విన్నవించామని ఇదే మంగళవారం మధ్యాహ్నం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ని కలవగా సానుకూలంగా స్పందించి అధికారులను అక్కడకక్కడే ఆదేశాలను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం పినపాక స్టేజ్ వద్ద నుంచి తల్లాడ మండల కేంద్రం వరకు, వీఎం. బంజర్ నుంచి మండాలపాడు (లంకపల్లి), కిష్టారం నుంచి సత్తుపల్లి, సత్తుపల్లి నుంచి బేతుపల్లి మీదుగా గంగారం వరకు ఫోర్ లైన్, కల్లూరు పట్టణ పరిధిలో ఫోర్ లైన్ ఉండగా సిక్స్ లైన్ రహదారులుగా విస్తరించాలని కోరారు. సత్తుపల్లి శివారు తాళ్లమడ గ్రామం మధ్యలో తమ్మిలేరు వాగుపై బ్రిడ్జిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని వివరించారు. అక్కడ అలైన్ మెంట్ మార్చి నేరుగా ఫోర్ లైన్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ఇటీవల నూతనంగా ప్రారంభించిన సమీకృత ఖమ్మం కలెక్టరేట్ భవనం పక్క నుంచి నాగపూర్ టూ అమరావతి హైవే వెళుతుందని తెలిపారు. ఖమ్మం నగరాన్ని రెండుగా చీల్చడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న అలైన్ మెంట్ మార్చాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీలు, ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.